Saturday, January 4, 2025

ఉక్రెయిన్ విద్యుత్ సరఫరాపై రష్యా భీకర దాడులు

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేయాలన్న లక్షంతో రష్యా భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతోంది. కీవ్ లోనే తొమ్మిది గంటల పాటు వైమానిక దాడులు జరిగాయి. పలితంగా లక్షలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా అందడం లేదు. దీంతోపాటు నీటిసరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతోంది. వాయువ్య రివ్నె రీజియన్‌లో 2,80,000 నివాస గృహాలకు, సరిహద్దు లోని వోలిన్ రీజియన్‌లో 2,15,000 గృహాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కీలకమైన మౌలిక సదుపాయాలన్నిటికీ విద్యుత్ సరఫరా లేకపోవడంతో జెనరేటర్లను వినియోగించవలసి వస్తోంది. ఉక్రెయిన్‌లోని మొత్తం విద్యుత్ సరఫరా సౌకర్యాలపై రష్యా దాడులు జరిగాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి హెర్మన్ హలూస్‌చెకో గురువారం ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

కీవ్, ఖర్కీవ్, రివ్నె, ఖెమెల్న్‌టిస్కీ, లుట్స్‌క్, నగరాలతోపాటు సెంట్రల్, పశ్చి ఉక్రెయిన్‌లోని ఇతర నగరాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ శీతాకాలంలో మొత్తం విద్యుత్ సరఫరాను దెబ్బతీయడమే లక్షంగా రష్యా దాడులు సాగిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధినేత ఆండ్రీ యెర్మార్క్ టెలిగ్రామ్ పోస్ట్‌లో ప్రకటించారు. ఉత్తర కొరియా వంటి మిత్ర దేశాల సహకారంతో రష్యా ఈ దాడులు సాగిస్తోందన్నారు. ఉక్రెయిన్‌పై బుధవారం రాత్రి సుమారు 90 క్షిపణులు, 100 డ్రోన్లతో రష్యా దాడులు చేసింది. బ్రిటన్, అమెరికా ఆయుధాలతో ఉక్రెయిన్ దాడికి దిగుతున్నందున తాము ప్రతిదాడికి దిగినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. లుటుస్కీ, వోలిన్ పట్టణాలపై భీకర దాడి జరిగిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. కొత్తగా డెవలప్ చేసిన బాలిస్టిక్ క్షిపణితో ఉక్రెయిన్‌పై దాడికి సిద్ధంగా ఉన్నట్టు పుతిన్‌వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News