- Advertisement -
మాస్కో: బ్రిటీష్ విమానయాన సంస్థలను తమ విమానాశ్రయాల్లో దిగకుండా, గగనతలం దాటకుండా రష్యా నిషేధించిందని దాని రాష్ట్ర పౌర విమానయాన నియంత్రణ సంస్థ శుక్రవారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ప్రతిస్పందనగా రష్యా ఫ్లాగ్ క్యారియర్ ఏరోఫ్లాట్ విమానాలపై లండన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ రష్యా బలగాలు ముందుకెళ్తున్నాయి. అయితే తాజాగా బ్రిటన్ విమానాలపై రష్యా ఆంక్షలు విధించింది. యుకె విమానాలు తమ గగనతలంలోకి రాకుండా బ్యాన్ చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేలా యుకె ఆంక్షలు విధించింది.
- Advertisement -