Thursday, January 9, 2025

దేశంలోకి ప్రవేశించకుండా యూకె ప్రధాని బోరిస్ జాన్సన్‌పై రష్యా నిషేధం!

- Advertisement -
- Advertisement -

Jhonson

మాస్కో:  బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్, మరో 10 మంది బ్రిటిష్ ప్రభుత్వ సభ్యులు, రాజకీయ నాయకులకు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. “బ్రిటీష్ ప్రభుత్వం యొక్క అపూర్వమైన శత్రు చర్య దృష్ట్యా ఈ చర్య తీసుకోబడింది, ప్రత్యేకించి సీనియర్ రష్యన్ అధికారులపై ఆంక్షలు విధించడం” అని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది, త్వరలో జాబితాను విస్తరిస్తామని పేర్కొంది.

ఇదిలావుండగా ఉక్రెయిన్ రాజధాని కైవ్ మరియు పశ్చిమ నగరమైన ఎల్వివ్‌లో శనివారం తెల్లవారుజామున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఇంతలో, ఉక్రెయిన్ అంతటా జరిగిన రష్యా దాడుల్లో కనీసం ఇద్దరు పౌరులు మరణించారని మరియు నలుగురు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.

మాస్కో యొక్క నల్ల సముద్ర నౌకాదళం యొక్క యుద్ధనౌక  ‘మోస్క్వా’ గురువారం మునిగిపోయినందుకు  ప్రతీకారంగా, కీవ్ శివార్లలోని ఓడ వ్యతిరేక క్షిపణుల తయారు చేసి,  మరమ్మతులు చేసే ఫ్యాక్టరీపై రష్యా దాడిచేసింది.  తన క్షిపణులలో ఒకటి ‘మోస్క్వా’ మునిగిపోయేలా చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. కాగా మందుగుండు సామాగ్రి పేలడం వల్ల మంటలు చెలరేగడంతో ఓడ సముద్రంలో మునిగిపోయిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌పై సైనిక దాడులు కొనసాగుతున్నప్పటికీ, రష్యా ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ యొక్క రెండవ రెజిమెంట్‌లోని కొన్ని భాగాలను భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించిందని అభిజ వర్గాలు  శుక్రవారం తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News