Monday, December 30, 2024

క్రిమియాలో ఉక్రెయిన్ డ్రోన్లు.. క్షిపణుల దాడిలో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్‌లోని రెండవ పెద్ద నగరం ఖర్కీవ్‌పై రష్యా బాంబు దాడిలో ముగ్గురు మరణించి, డజన్ల కొద్దీ ఆసుపత్రుల్లో చేరిన మరునాడు ఆదివారం ఉక్రెయిన్ డ్రోన్, క్షిపణుల దాడుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని రష్యన్ అధికారులు వెల్లడించారు. రష్యా ఆక్రమించుకున్న క్రిమియాలోని రేవు నగరం సెవస్తొపోల్‌లో ఐదు ఉక్రెయిన్ క్షిపణులను పతనం గావించినప్పుడు కూలిపోతున్న శిథిలాల కింద ఇద్దరు పిల్లలు సహా ముగ్గురు మరణించినట్లు నగర మాస్కో నియమిత గవర్నర్ మిఖాయిల్ రజ్వొఝయేవ్ తెలియజేశారు. సుమారు వంద మంది గాయపడినట్లు ఆయన తెలిపారు. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యన్ బెల్గొరాడ్ ప్రాంతంలో గ్రేవొరోన్ నగరంపై మూడు

ఉక్రెయిన్ ద్రోన్లు దాడి చేసినప్పుడు ఒక వ్యక్తి మరణించినట్లు, ముగ్గురు గాయపడినట్లు ప్రాంతీయ గవర్నన్ వ్యచెస్లావ్ గ్లాద్‌కొవ్ తెలిపారు. రష్యా శనివారం మధ్యాహ్నం నాలుగు ఏరియల్ బాంబులతో ఖర్కీవ్‌పై దాడి చేసి, ఒక ఐదంతస్తుల నివాస భవనం దెబ్బ తిన్నది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 41 మంద ఇప్పటికీ గాయాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రాంతీయ గవర్నర్ ఒలెహ్ సైనీహుబోవ్ తెలిపారు, ఆ దాడి తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తమ గగన తల రక్షణ బలగాలకు అదనపు సాయం చేయవలసిందిగా తమ దేశ భాగస్వాములకు ఒక వీడియో ప్రసంగం ద్వారా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News