Tuesday, November 5, 2024

స్టీల్‌ప్లాంట్‌పై బాంబుల వర్షం

- Advertisement -
- Advertisement -

Russia bombs Ukraine steel plant

అమెరికా మంత్రులతో జెలెన్‌స్కీ చర్చలు
ముప్పు తప్పించాలని వారికి వినతి
సాయానికి ఇదే తుదిగడువు
మేరియూపోల్ రష్యా కైవస దశ

కీవ్ : ఉక్రెయిన్ మేరియూపోల్‌లోని అత్యంత కీలకమైన దుర్భేధ్యమైన స్టీల్ ప్లాంట్‌పై రష్యా సేనలు ఆదివారం బాంబులతో భీకరదాడులు జరిపాయి. ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్‌తో ఆదివారం భేటీ అయ్యారు. మేరియూపోల్‌లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితిని వారికి వివరించారు. తక్షణం అమెరికా మిత్రదేశాల నుంచి తమకు సైనిక ఆయుధ సాయం భారీ స్థాయిలో అందాల్సి ఉంటుందని లేకపోతే ఇక ఇక్కడి అత్యంత కీలకమైన స్టీల్ ప్లాంట్ ధ్వంసం లేదా అక్కడి సైన్యం సరెండర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే తమ సైనికులకు మరింత స్థయిర్యం కల్పించేందుకు తక్షణం ఆయుధాల సాయం అవసరం అని వారికి వివరించారు. స్టీల్‌ప్లాంట్‌లో ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు. రష్యా సైనికులను ప్రతిఘటిస్తున్నారు. ఫ్యాక్టరీపై వైమానిక బాంబు దాడులు సాగుతున్నాయి. ఈ ప్లాంట్ నాశనం అయితే ఇక ఉక్రెయిన్‌లోని ఈ అత్యంత ప్రధాన నగరం మేరియూపోల్ రష్యా కైవసం పూర్తి అవుతుంది.

తరువాతి దశలో రష్యా నుంచి ఉక్రెయిన్‌పై దాడులు మరింతగా సాగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ అమెరితో ఉన్నతస్థాయిలో చర్చించనున్నారు. తమకు తలెత్తిన అత్యంత ప్రమాదకరపరిస్థితిని వారికి తెలియచేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కీవ్‌లో తాను అమెరికా అధికారులతో భేటీ అవుతానని జెలెన్‌స్కీ చెప్పారు. ఇప్పుడు మేరియూపోల్‌లో పరిస్థితి శృతి మించిపోతున్నందున తక్షణం సాయం మరింత అవసరం అని ,ఈ దిశలో స్పందించాల్సి ఉందనే విషయాన్ని అమెరికా అధికారవర్గాలకు తెలియచేస్తామని జెలెన్‌స్కీ తెలిపినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. అమెరికా నుంచి అయినా ఇతర దేశాల నుంచి అయినా కేవలం మాటలు కాదు కార్యాచరణ దిశలో ముందడుగు అని జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News