Saturday, November 16, 2024

రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ..

- Advertisement -
- Advertisement -

 రెండు నగరాల్లో పౌరులతరలింపు కోసం మానవతా కారిడార్ల ఏర్పాటు:రష్యా రక్షణ శాఖ ప్రకటన
 రష్యా ఒప్పందానికి లేదు
 మరియుపోల్ పౌరుల తరలింపు వాయిదా వేస్తున్నాం: ఉక్రెయిన్
 తరలింపును వారే అడ్డుకుంటున్నారు: రష్యా

మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. రెండు నగరాల్లో మా నవతా సాయం అందించడానికి వీలుగా శనివారం తా త్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా రక్షణ మం త్రిత్వ శాఖ తెలిపింది. మాస్కో స్థానిక కాలమానం ప్రకా రం శనివారం ఉదయం 10 గంటలకు కాల్పుల విరమ ణ ప్రారంభమవుతుందని తెలిపింది. మరియుపోల్, వో ల్నోవాఖా నగరాల సాధారణ పౌరులను తరలించ డానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా మా నవతా నడవా తెరవనున్నట్లు తెలిపింది. అయిదున్నర గంటల సేపు కాల్పుల విరమణ కొనసాగు తుందని తెలుస్తోంది. మరియుపోల్‌ను స్వాధీనం చేసు కున్న తర్వాత కొద్ది రోజునుంచి విద్యుత్,తాగునీరు, ఆహా రం, హీటింగ్, రవాణా సదుపాయాలను రష్యా నిలిపి వేసొంది. కాల్పుల విరమణ సమయంలో వీటిని పునరుద్ధ రించనున్నట్లు రష్యా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పౌరుల త రలింపునకు రష్యా బలగాలు సహకరించడం లేదని ఉక్రె యిన్ అధ్యక్షుడి సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ ఆరోపిం చారు. మరియుపోల్‌నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ ను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. తమ ప్రాంతంపై శతఘ్ని దాడులు కొనసాగుతున్నాయని మరి యుపోల్ నగర అధికారి ఒకరు చెప్పారు. రష్యా ఒప్పం దానికి కట్టుబడనందున నగరం పౌరుల తరలింపు ను వాయిదా వేసుకుంటున్నట్లు అధికారులు ఒక ప్రకట తనలో తెలిపారు. మరోవైపు పౌరుల తరలింపునకు మరి యుపోల్ అధికారులే అనుమతించడం లేదని రష్యా వి దేశాంగ మంత్రి పెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. రష్యా నుం చి మానవతా సాయాన్ని స్వీకరించేందుకు ఖేర్సన్ అధికా రులు నిరాకరించారని ఆయన తెలిపారు. ఈ పరస్పర ఆ రోపణలు ఎలా ఉన్నప్పటికీ పౌరుల తరలింపు కొనసాగు తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఉక్రెయిన్‌పై రష్యా సైని క దాడులను ఆపేందుకు దౌత్య కృషి కొనసాగుతోంది. పోలండ్ ప్రధాని, విదేశాంగ మంత్రితో చర్చలు జరిపేం దుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటగోనీ బ్లింకెన్ శనివారం ఆ దేశానికి చేరుకున్నారు. బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశంలో పాల్గొన్న ఒక రోజు తర్వాత బ్లింకెన్ పోలాండ్ రావడం గమనార్హం.
14.5 లక్షల మంది వలస
మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు మొదలైన ప్పటినుంచి ఇప్పటివరకు ఆ దేశం 14.5 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లారని అంతర్జాతీయ వ లసల సంస్థ ఉక్రెయిన్ వేల సంఖ్యలో జనం పొరుగున ఉన్న హంగరీ, మోల్డోవా, రొమేనియా, స్లోవేకియా తదితర దేశాలకు వెళ్లి ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఆయా దేశాలు అందించిన వివరాల ప్రకారం పోలండ్‌కు 7,87, 300 మంది, మోల్డోవాకు 2,28,700 మంది, హంగరీకి 1,44,700 మంది, రొమేనియాకు 1,32, 600 మంది, స్లోవేకియా కు 1,00,500 మంది తరలి వెళ్లి నట్లు ఐఒఎ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉక్రె యిన్‌లో ఉంటున్న 138 దేశాలకు చెందిన పౌరులు సరి హద్దులు దాటి పొరుగు దేశాల్లోకి వెళ్లినట్లు తెలిపింది.

మళ్లీ దాడులు మొదలు
తాత్కాలిక కాల్పుల విరమణ సమయం ముగి సిన వెంటనే రష్యా తిరిగి ఉక్రెయిన్‌పై దాడులు మొ దలు పెట్టింది. ఉక్రెయిన్ పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నువాఖా నగరాలు లక్షంగా క్షిపణి దాడులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పర్యాటక ప్రాంతమైన మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునే దిశగా రష్యా బలగాలు ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రష్యాతో యుద్ధంలో ఉక్రె యిన్‌లోని అందమైన నగరాలు శ్మశానంగా మారు తున్నాయి. ఆర్తనాదాలు, రోదనలు మిన్నుముడు తున్నాయి. దీంతో రష్యా బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పౌరులు తరగబడుతున్నారు. రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ నగరంలో శనివారం వందలాది మంది ఉక్రెయిన్లు వీధుల్లోకి వచ్చారు. యుద్ధ ట్యాంకులకు కూడా వెరవకుండా నిరసనలు చేస్తున్నారు. ఈ నెల 3న ఖేర్సన్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

Russia Breaks to firing on Ukraine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News