- Advertisement -
పుతిన్ స్పష్టీకరణ
మాస్కో: రష్యాను ఎవరూ ఏకాకిని చేయలేరని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. మంగళవారం తూర్పు రష్యాలోని వోస్తోచిని అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు తానుగా ఒంటరిగా మారే ఉద్దేశం రష్యాకు లేదని, తమను ఏకాకిని చేయడానికి విదేశీ శక్తులు సాగిస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని వ్యాఖ్యానించారు. నేటి ప్రపంచంలో..ప్రత్యేకంగా రష్యా లాంటి పెద్ద దేశాన్ని ఏకాకిని చేయడం ఎవరికీ సాధ్యం కాదని ఆయన చెప్పారు. తమతో సహకరించడానికి ఇష్టపడే దేశాలతో కలసి పనిచేస్తామని పుతిన్ అన్నారు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టాక పుతిన్ మాస్కో వెలుపల పర్యటించడం ఇదే మొదటిసారి. పుతిన్ వెంట బెలారుసియన్ అధ్యక్షుడు అలెక్జాండర్ లుకాషెంకో ఉన్నారు.
- Advertisement -