Friday, November 22, 2024

రష్యాలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -
Russia confirms 180071 Covid-19 Cases
కొత్తగా 180071 కరోనావైరస్ కేసులు

మాస్కో: రష్యాలో నెల క్రితంతో పోల్చినప్పుడు కరోనావైరస్ సంక్రమణలు పదిరెట్లు పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 180071కి పెరిగిపోయింది. రష్యా వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగం విస్తరించింది. గత రోజుతో పోల్చినప్పుడు కొత్తగా 2800 కేసులు నమోదయినట్లు అక్కడి ప్రభుత్వ కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్ ఆదివారం తెలిపింది. ఇటీవల వారాల్లో సంక్రమణలు నాటకీయంగా అక్కడ బాగా పెరిగిపోయాయి. మరణాల సంఖ్య మునుపటి రోజు సంఖ్య 796 కన్నా 661 కి తగ్గిందని జనవరి 6న వెల్లడించింది. మహమ్మారి కాలంలో 12.8 మిలియన్ మందికి కరోనా వ్యాధి సంక్రమించిందని, 335414 మంది మరణించారని తెలిపింది.

ఇదిలా ఉండగా వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ కరోనావైరస్ ఆంక్షాలను తగ్గించే విషయాన్ని తన ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ గతవారం తెలిపారు. కొవిడ్19 రోగితో కాంటాక్ట్‌కు వచ్చిన వ్యక్తి విధిగా ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని ఇప్పుడున్న ఆంక్షను ఖచ్చితం చేశారు. రష్యా గత నెల నుంచే 12 నుంచి 17 ఏళ్ల వయస్సు బాలలకు వ్యాక్సిన్ ఇవ్వడం మొదలెట్టింది. అక్కడ స్వదేశంలో తయారుచేసిన స్పుత్నిక్ ఎం జాబ్‌ను పిల్లలకు ఇస్తున్నారు. ఇప్పటి వరకు రష్యా 146 మిలియన్ జనాభాలో సగం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ప్రపంచంలో కొవిడ్19 వ్యాక్సిన్‌లు ఇవ్వడంలో రష్యానే ముందుండింది. కానీ ఇప్పటికీ సగం మందికే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News