Saturday, December 28, 2024

ఉక్రెయిన్ పై రష్యా బాంబులతో దాడి

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగింది. రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగిస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరూ జోక్యం చేసుకున్న ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. మారియపూల్‌లోని ఖార్ఖీవ్ ప్రాంతంలో రష్యా దళాలు బాంబులతో దాడులు చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలను విడిచిపెట్టడంతో వేర్పాటు వాదులు లొంగిపోవాలని పుతిన్ సూచించారు. ఏదైనా రక్తపాతం జరిగితే ఉక్రెయిన్ సైన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. బాంబులతో ఉక్రెయిన్ ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. ఉక్రెయిన్ లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

 

https://twitter.com/PrimeTobirama/status/1496684798525554689

 

https://twitter.com/WW32022/status/1496700469116342280

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News