Monday, December 23, 2024

విజయ దినోత్సవం సందర్భంగా ఉక్రెయిన్‌పై క్షిపణులు ప్రయోగించిన రష్యా!

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా మంగళవారం కీవ్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయాన్ని పురస్కరించుకుని రెడ్ స్కేర్ అంతటా దళాలు, పాత కాలపు పరికరాలతో కవాతు చేసింది. కాగా కీవ్ మాత్రం వైమానిక దాడులను తిప్పికొట్టింది. అంతేకాక యూరోపియన్ యూనియన్ అధిపతికి ఆతిథ్యం ఇచ్చింది. క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగంలో పాశ్చాత్య ప్రపంచ ప్రముఖలపై ఉరిమారు. రష్యా అస్తిత్వపు ముప్పును ఎదుర్కొంటోందన్నారు.

జర్మనీ మే 8, 1945న లొంగిపోయింది. అయితే ఇది మాస్కో కాలమానం ప్రకారం మే 9, 1945. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల నుండి రష్యా ఎలాగైతే ముప్పును ఎదర్కొన్నదో ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి ఎదుర్కొంటోందన్న సారూప్యాన్ని పుతిన్ తన ప్రసంగంలో వెల్లడించారు. నేడు రష్యాలో ముఖ్యమైన సెలవు దినం.

యూరొపియన్ యూనియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌కు ఉక్రెయిన్ ఆతిథ్యం ఇస్తోంది. రాత్రిపూట రాజధాని నగరం కీవ్ మీద రష్యా 25 క్రూయిజ్ మిస్సైల్స్ ప్రయోగించగా, వాటిలో 23 క్షిపణులను ఉక్రెయిన్ వైమానిక దళం పడగొట్టాయి. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఉక్రెయిన్‌పై రష్యా రాత్రిపూట చేసిన దాడుల్లో ఇది రెండవది. నెలలో ఐదవది. పౌరులను లక్షంగా చేసుకున్నామన్న విషయాన్ని మాస్కో ఖండించింది. తన వైమానిక దాడుల లక్షం కేవలం ఉక్రెయిన్ పోరాట పటిమను తగ్గించడమేనంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News