- Advertisement -
మాస్కో: సామాజిక మాధ్యమం ట్విటర్‌పై రష్యా ఆంక్షలు విధించింది. ఫోటోలు, వీడియోలను ట్విటర్‌లో అప్‌లోడ్ చేయడంలో స్పీడ్ తగ్గించింది. నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో విఫలమైనందునే ఈ ఆంక్షలు కొనసాగిస్తున్నట్టు వివరించింది. పిల్లల్లో ఆత్మహత్యలను ప్రేరేపించడం, డ్రగ్స్, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నిషేధిత సమాచారాన్ని తొలగించడంలో ట్విటర్ విఫలమైందని రస్యా సమాచార నియంత్రణ సంస్థ రోస్కోమ్నాడ్జోర్ వెల్లడించింది.
- Advertisement -