Sunday, December 22, 2024

భారతీయ విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

Russia investigates Indian student's death

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌కు చెందిన ఖార్కివ్‌లో చనిపోయిన 21 ఏళ్ల భారతీయ వైద్య విద్యార్థి మృతిపై రష్యా దర్యాప్తు చేయనుంది. ఈ విషయాన్ని రష్యా అంబాసిడర్ డెనిస్ అలిపోవ్ తెలిపారు. ఖార్కివ్ నేసనల్ మెడికల్ యూనివర్శిటీలో నాలుగో సంవత్సరం మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప గ్యానగౌడర్ ఉక్రెయిన్‌పై జరిగిన బాంబు దాడిలో మరణించాడు. ఆహారం తెచ్చుకునేందుకు వెళ్లినప్పుడు అతడు మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని అతడి మిత్రులు తెలిపారు. ఇదిలావుండగా అతడి మరణం వెనుక అసలైన కారణాలు, పరిస్థితులు ఇంకా స్పష్టంకాలేదని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లే తెలిపారు. “నవీన్ శేఖరప్ప గ్యానగౌడర్ కుటుంబానికి, యావత్ దేశానికి ఈ విషాధ ఘట్టంపై నా సానుభూతి వ్యక్తంచేసుకుంటున్నాను’ అని ఆయన పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ‘యుద్ధ ప్రదేశంలో భారతీయులు రక్షణకు కావలసిన చర్యలన్నీ రష్యా తీసుకుంటుంది’ అని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News