Thursday, January 23, 2025

ఉక్రెయిన్ మారణకాండకు రష్యాదే బాధ్యత

- Advertisement -
- Advertisement -

Russia is responsible for the massacre in Ukraine

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ వెల్లడి
భారత ప్రధానితో వీడియో సమీక్ష
మైత్రిని ప్రస్తావించిన మోడీ

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో ఇప్పటి భారీ స్థాయి ప్రాణ నష్టానికి రష్యానే జవాబుదారీ వహించాల్సి ఉంటుందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ సోమవారం స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో స్కాట్ వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య మైత్రీబంధం వంటి కీలక అంశాల నేపథ్యంలో ఉక్రెయిన్ అంశంపై ఆస్ట్రేలియా ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటువంటి భయానక పరిస్థితి ఇకపై తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవల్సి ఉందని ఆస్ట్రేలియా నేత తెలిపారు. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న దాడిలో వేలాది మంది పౌరులు మృతి చెందుతున్నారు. అత్యధిక సంఖ్యలో నిర్వాసితులు అయ్యారు. ఇటువంటి పరిస్థితి ఎక్కడా తలెత్తకూడదని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇటీవలి క్వాడ్ దేశాల భేటీలో చర్చ జరిగిందని మోరిసన్ గుర్తు చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతపు పరిణామం నేపథ్యంలో యూరప్‌లో తలెత్తిన పరిస్థితులను ఈ క్వాడ్ భేటీలో చర్చించేందుకు వీలేర్పడినట్లు తెలిపారు.

ప్రధాని మోడీ తమ ప్రసంగంలో ప్రత్యేకించి భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాల గురించి ప్రస్తావించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం అమలులోకి రావడం వల్ల ఉభయదేశాల మధ్య సరైన ఆర్థిక భద్రతకు వీలేర్పడిందని తెలిపారు. క్వాడ్‌లోనూ ఇరుదేశాల మధ్య సవ్యమైన రీతిలో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. కీలక రంగాలతో పాటు అత్యంత ప్రాధాన్యత గల ఖనిజాలు, నీటి నిర్వహణ, పునరుత్థాన ఇంధనం, కొవిడ్ పరిశోధనల వంటి వాటిపై కూడా సమీక్ష సాగుతోందని వివరించారు. ఉక్రెయిన్ గురించి ప్రధాన మంత్రి మోడీ ప్రస్తావించలేదని వెల్లడైంది. భారతదేశపు విదేశాంగ విధానాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ప్రస్తావించారు. కీలక అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ అనేక సార్లు చొరవ తీసుకుని సవ్యంగా వ్యవహరించిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News