Friday, January 10, 2025

ఉక్రెయిన్ అణుహెడ్‌ను కిడ్నాప్ చేసిన రష్యా దళాలు

- Advertisement -
- Advertisement -

Russia kidnapping head of Ukraine nuclear plant

కీవ్ : రష్యా సైనిక దళాలు తమ దేశంలోని జపోరిజియా అణు కేంద్రం డైరెక్టర్ జనరల్ ఇరోహ్ మురాషోవ్‌ను దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాయని ఉక్రెయిన్ ఆరోపించింది. తమ భూభాగాలను తమ వశం చేసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే రష్యా సైనిక దళాలు మురాషోన్‌కు కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకువెళ్లాయని తెలిపింది. అవసరం అయితే అణుయుద్థానికిదిగుతామని, ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత ముమ్మరం చేస్తామని రష్యా అధ్యక్షులు పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే రష్యాకు చెందిన అణుకేంద్రం హెడ్‌ను అపహరించుకుపోవడం కీలకంగా మారింది. రష్యా అధికారికంగా చేజిక్కించుకున్న తమ ప్రాంతాలను తిరిగి వశపర్చుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ ప్రకటించారు. లైమన్ ప్రాంతంలో తమ బలగాలు వేలాది మంది రష్యాసైనికులను చుట్టుముట్టాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News