రష్యా, ఉక్రెయిన్‌లు శనివారం ఒకదానిపై మరొకటి ఘోరంగా వైమానిక దాడులు జరుపుకున్నాయి. ఇరు పక్షాలు వంద డ్రోన్లతో తమపై దాడులు జరిగాయని పేర్కొన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అమెరికా 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదిత ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, అమెరికా దూత స్టీవ్ విట్కాఫ్‌ను కలుసుకున్న 24 గంటలలోపే ఈ దాడులు జరిగాయి. డ్రాన్లతో దాడులు జరిగిన విషయాన్ని వోల్గోగ్రాడ్ ప్రాంత గవర్నర్ ఆండ్రీ బొచారోవ్ ధ్రువీకరించారు. ఉక్రెయిన్ మీద మాస్కో పూర్తి స్థాయి యుద్ధాన్ని మొదలెట్టాక కీవ్ బలగాలు అనేకమార్లు వోల్గోగ్రాడ్ రిఫైనరీని లక్షంగా చేసుకుని అనేకమార్లు దాడులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన 126 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా రాత్రికి రాత్రే రష్యా 178 డ్రోన్లతో శనివారం దాడులు చేసిందని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. అందులో 130 డ్రోన్లను నేల కూల్చినట్లు కూడా ఉక్రెయిన్ బలగాలు పేర్కొన్నాయి.
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య భీకర వైమానిక దాడులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -