- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ పై రష్యా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా చెర్నిహైవ్ నగరంలోని ఆయిల్ డిపోపై బాంబులు వేసింది రష్యా. దీంతో డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కీలక లక్ష్యాలతో పాటు జనావాసాలపై బాంబుల వర్షం కురుపిస్తోంది. కీవ్ లో మెట్రో స్టేషన్, కౌన్సిల్ భవనం పై రష్యా బలగాలు దాడులు జరిపాయి. రష్యా యుద్ధంలో కీవ్, ఖార్కీవ్ లో విధ్వంసం నెలకొంది. కీవ్, ఖార్కీవ్ తో పాటు మైక్లోవి, లివివ్, జిటోమిర్ నగరాలపై రష్యా రాకెట్ దాడులు చేసింది. రెండు వ్యూహాత్మక రష్యా పోర్టుల్ని స్వాధీనం చేసుకుంది. కీవ్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఇందనం కొరతతో రష్యా కాన్వాయ్ నిలిచిపోయింది. ఇప్పటివరకు 10లక్షలకు పైగా ప్రజలు ఉక్రెయిన్ ను నుంచి ఇతర దేశాలకు వలస వెల్లినట్టు తెలుస్తోంది.
- Advertisement -