Friday, January 24, 2025

ఉక్రెయిన్‌పై తొలిసారి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన రష్యా

- Advertisement -
- Advertisement -

రష్యా తొలిసారి ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో దాడి జరిగింది. ఈ విషయాన్ని గురువారం కీవ్ వాయుసేన వెల్లడించింది. డెనిఫర్ నగరం లో పై దాడి జరిగినట్టు పేర్కొంది. కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. దీంతోపాటు ఎక్స్ 47ఎం2 కింజల్ బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించినట్టు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఇది తమ సైనికులను అడగాల్సిన ప్రశ్న అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఖండాంతర క్షిపణి (ఐసీబీఎం)ని దీర్ఘశ్రేణి ఆయుధంగా పరిగణిస్తారు. కనీసం 5500 కిమీ దూరం లోని లక్షాలను ఛేదించగల సామర్థం ఉంటేనే దీనిని ప్రయోగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News