Sunday, December 22, 2024

ఉక్రెయిన్‌పై 75 డ్రోన్లతో రష్యా దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌పై శనివారం తెల్లవారు జామున రష్యా 75 డ్రోన్లతో దాడి చేసింది. తెల్లవారు జామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వకె ఈ డ్రోన్లు వెల్లువెత్తినట్టు అధికారులు తెలిపారు. దేశ రాజధాని కీవ్ ప్రధాన లక్షంగా ఈ దాడి జరిగినట్టు ఉక్రెయిన్ వాయుసేన కమాండర్ మైకోలా ఒలేష్ చుక్ తెలిపారు. మొత్తం 75 ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్టు చెప్పారు. 77 నివాస భవనాలు, 120 కార్యాలయాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్టు వెల్లడించారు. డ్రోన్ల ద్వారా కీవ్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడి ఇదేనని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఐదుగురు పౌరులు గాయపడినట్టు కీవ్ మేయర్ విటాలి క్లిట్కో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News