Wednesday, January 22, 2025

12 వేల మంది సైనికులను కోల్పోయిన రష్యా

- Advertisement -
- Advertisement -

Russia loses 12,000 troops

 

కీవ్ : ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా ఇప్పటివరకు దాదాపు 12 వేల మంది సైనికులను కోల్పోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ వెల్లడించింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 8 వరకు జరిగిన భీకర పోరులో రష్యా వైపు 12 వేల సైనికులు మరణించగా, రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్‌ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు , 80 హెలికాప్టర్లు, 60 ఇంథన ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే రష్యామాత్రం ఈ వివరాలను ఖండిస్తోంది. ఇప్పటివరకు తమవైపు కేవలం 498 సైనికులు మాత్రమే మరణించినట్టు చెబుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News