Wednesday, January 22, 2025

సంగీత కార్యక్రమంలో కాల్పులు: 60 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్‌లో ఉగ్రవాదులకు కాల్పులకు తెగపడ్డారు. సంగీత కార్యక్రమం జరుగుతుండగా తీవ్రవాదులు హాల్‌లోకి ప్రవేశించి విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో 60 మంది దుర్మరణం చెందగా వంద మందిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుండగులు భవనంలోకి ప్రవేశించి కాల్పులు జరపడంతో సంగీత ప్రియులు పరుగులు తీశారు. కొందరు సీట్ల మధ్య దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హాల్‌లో చిక్కుకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దుండగులు కాల్పులు జరుపుతుండగా పలువురు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాల్పుల జరపడంతో భవనంలో మంటలు చెలరేగి నల్లటి పొగలు వ్యాపించాయి. ఈ దాడి తామే చేశామని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. గత 20 సంవత్సరాల నుంచి ఇదే అతి పెద్ద దాడి అని స్థానిక మీడియా వెల్లడించింది. 2002లో మాస్కోలోని ఓ థియేటర్‌పై చెచెన్ తీవ్రవాదులు దాడి చేయడంతో 129 మంది, 41 మిలిటెంట్టు మరణించారు. 2004లో బెస్లాన్‌లోని ఓ పాఠశాలలోకి చెచెన్ తీవ్రవాదులు చొరబడి కాల్పులు జరపడంతో 330 మంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News