Tuesday, April 29, 2025

మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్న ర‌ష్యా

- Advertisement -
- Advertisement -

Russia occupies the city of Melitopol

 

మాస్కో:  రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వణికి పోతోంది. ఓ వైపు హెచ్చరికల సైరన్లు, మరో వైపు భారీ బాంబు దాడుల శబ్దాలతో నగరం మొత్తం రణరంగంగా మారినట్లు తెలుస్తోంది.  మెలిటోపోల్ న‌గ‌రాన్ని సంపూర్ణంగా చేజిక్కించుకున్న‌ట్లు ర‌ష్యా ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్‌పై ర‌ణ‌భేరి మోగించిన ర‌ష్యా.. మూడ‌వ రోజు కూడా త‌న దాడుల్ని కొన‌సాగిస్తోంది. ద‌క్షిణ ప్రాంత‌మైన జ‌పోరిజ్‌యాలో ఉన్న మెలిటోపోల్ సిటీని స్వాధీనం చేసుకున్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ తెలిపింది. మెలిటోపోల్ ఓ మ‌ధ్య స్థాయి న‌గ‌రం. ఉక్రెయిన్‌లోని మారియోపోల్ పోర్ట్ స‌మీపంలో ఈ ప‌ట్ట‌ణం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News