Thursday, January 23, 2025

ఆంక్షలకు అతీతంగా భారత్‌కు రష్యా చమురు

- Advertisement -
- Advertisement -

మాస్కో : చమురు సరఫరా విషయంలో భారతదేశానికి పూర్తిస్థాయిలో సాయానికి శిలాజ చమురు సంపన్న దేశం రష్యా ముందుకు వచ్చింది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధించిన చమురు ధరల పరిమితి, కోటా సమస్యను భారత్ అధిగమించేలా చేస్తామని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ తెలిపారు. మాస్కోలో భారత రాయబారి పవన్ కపూర్, రష్యా ఉప ప్రధాని మధ్య సుదీర్ఘ చర్చల దశలో ఆదివారం కీలక నిర్ణయం వెలువడింది. ఓ వైపు యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌ల నుంచి ఇన్సూరెన్స్ సేవలపై నిషేధం, ట్యాంకర్ల ద్వారా చమురు సరఫరా వంటి అంశాలతో నిమిత్తం లేకుండా రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతి జరుగుతుంది.

ఈ క్రమంలో లీజింగ్ , భారీ స్థాయి సామర్థపు షిప్‌ల తయారీకి ఇండియా సహకారాన్ని రష్యా అభ్యర్థించింది. ఈ ఏడాది తొలి ఎనిమిదేళ్లలో రష్యా నుంచి ఇండియాకు చమురు ఎగుమతులు 16.35 మిలియన్ టన్నుల స్థాయికి పెరిగాయి. వేసవిలో రష్యా నుంచి ఇండియాకు చమురు సరఫరా బాగా పెరిగింది. ప్రపంచ ఇతర దేశాలతో పోలిస్తే ఇది రెండో స్థాయిగా ఉంది. అయితే రష్యా నుంచి విపరీత స్థాయిలో చమురు దిగుమతి చేసుకోవడంపై భారత్‌పై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు తీవ్రతరం అయ్యాయి. ఉక్రెయిన్‌పై తాము శాంతి చర్చలకు చొరవ తీసుకుంటామని, యుద్ధం సమసిపొయ్యేలా దౌత్యానికి దిగుతామని భారత్ పలుసార్లు ప్రతిపాదించింది. ఇదే దశలో రష్యా నుంచి తక్కువ ధరలో చమురు అందితే దీనిని స్వీకరిస్తామని, ఇది దేశ ప్రయోజనాల కోణంలో తమ నిర్థిష్ట వైఖరి అని భారత ప్రభుత్వం పలు వేదికల నుంచి తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News