Friday, December 20, 2024

ప్రిగోజిన్ మృతిపై రష్యా అధికారిక నిర్థారణ

- Advertisement -
- Advertisement -

మాస్కో : వాగ్నర్ ప్రైవేటు సైన్యం అధినేత యెవెగెని ప్రిగోజిన్ మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఉన్నట్లు, దీనిని నిర్థారించుకున్నట్లు రష్యా దర్యాప్తు కమిటి ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటనా స్థలిలో దొరికిన పది మృతదేహాలను గుర్తించారు. వారి పూర్వాపరాలను అధికారిక రికార్డుల మేరకు ధృవీకరించుకున్నారని ప్రకటనలో తెలిపారు. బుధవారం రష్యాలో ప్రైవేటు విమానం ఒకటి కుప్పకూలి పది మంది దుర్మరణం చెందారు. వీరిలో పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ కూడా ఉండటం సంచలనానికి దారితీసింది. ప్రిగోజిన్‌తో పాటు ఆయన సైన్యానికి చెందిన కొందరు అగ్రస్థాయి దళనేతలు కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News