మాస్కో : ఒమిక్రాన్ అత్యధిక వ్యాప్తితో రష్యాలో కరోనా కొత్త కేసుల ఉప్పెన ముంచుకు వస్తోందని, ఇప్పుడు తామంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నామని బుధవారం ఉన్నత స్థాయి అధికార వర్గాల సమావేశంలో రష్యా ప్రధాని పుతిన్ వెల్లడించారు. ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడేందుకు ఆరోగ్య భద్రతా వ్యవస్థ ఉద్యమించాలని ఆయన సూచించారు. రష్యాలో సోమవారం 15,000 కేసులు నమోదు కాగా, మంగళ, బుధవారాల్లో 17,000 వరకు కేసులు పెరిగాయని రష్యా కరోనా టాస్క్ ఫోర్స్ వెల్లడించింది. మంగళవారం ఒమిక్రాన్ కేసులు 305 నమోదు కాగా, బుధవారం రెట్టింపు సంఖ్యలో 698 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో పుతిన్ అధ్యక్షతన అధికార స్థాయిలో సమావేశమై కరోనా కేసులపై సమీక్షించారు. డిసెంబర్‌లో రోజువారీ కేసులు 30,000 వరకు నమోదు కాగా, ఇప్పుడు కొత్త కేసులు 15,000 నుంచి 18,000 వరకు నమోదయ్యాయి. మొత్తం మీద 10.6 మిలియన్ కొత్త కేసులు నిర్ధారణ కాగా, 3,17,618 మరణాలు సంభవించాయని టాస్క్‌ఫోర్స్ వెల్లడించింది.
కరోనా ఉప్పెన అంచున రష్యా : పుతిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -