Monday, December 23, 2024

18-65 ఏళ్ల వయస్సు గల పురుషులకు రష్యన్ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ల అమ్మకం నిలిపివేత

- Advertisement -
- Advertisement -

No Russian air tickets for men

రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందిన యువకులు మాత్రమే దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి.

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో పోరాడటానికి దేశం రిజర్వ్‌లను సమీకరించనున్నట్లు చెప్పడంతో రష్యా నుండి బయలుదేరే విమానాలు దాదాపు పూర్తిగా బుక్ చేయబడ్డాయి. అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్, కజాఖ్‌స్థాన్‌లోని సమీప దేశాలలోని నగరాలకు నేరుగా విమానాల టిక్కెట్లు బుధవారం అమ్ముడయ్యాయి. రష్యాలో ప్రసిద్ధి చెందిన Aviasales వెబ్‌సైట్ చూపించింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో రష్యాకు, రష్యా నుండి ముఖ్యమైన ప్రయాణ కేంద్రంగా మారిన ఇస్తాంబుల్‌కు విమానాలు శనివారం వరకు పూర్తిగా బుక్ చేయబడ్డాయని పేర్కొంది.  పుతిన్ బుధవారం ప్రసంగం తర్వాత, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు 300000 మంది పురుషులను సర్వీసుకు పిలవొచ్చని పేర్కొన్నారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం తన 2 మిలియన్ల సైనిక నిల్వలను పాక్షిక సమీకరణపై డిక్రీపై సంతకం చేసినట్లు ప్రకటించారు. “మాతృభూమి, దాని సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి” తీసుకున్నట్లు పుతిన్ చెప్పిన ఈ నిర్ణయంను పశ్చిమ దేశాలు విమర్శించాయి, రష్యాలో భయాలను రేకెత్తించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News