Wednesday, January 22, 2025

కెర్చ్ వంతెనకు రష్యామరమ్మతులు

- Advertisement -
- Advertisement -

Russia Repairs to Kerch Bridge

కీవ్: రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీపకల్పాన్ని కలిపే కెర్చ్ వంతెన మరమ్మతులను రష్యా యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. ఈ వంతెన రక్షణ బాధ్యతలను ఫెడరల్ సర్వీసెస్‌కు అప్పజెబుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. వంతెనపై దెబ్బతిన్న భాగాలను కూల్చివేయాలని, డైవర్లు వెంటనే దర్యాప్తును మొదలు పెట్టాలని రష్యా ఉప ప్రధాని ఆదివారం ఉదయం ఆదేశించారు. కెర్చి వంతెనను రష్యన్లు ఈ శతాబ్దం లోనే అత్యున్నత నిర్మాణంగా భావిస్తారు. క్రిమియాకు ఆయుధాలు, మందుగుండు, యుద్ధ పరికరాలు, దళాలను తరలించడానికి దీన్ని వినియోగిస్తారు. ఆదివారం జరిగిన దాడిలో వంతెన 19 వ కిలో మీటర్ వద్ద చాలా భాగం కుప్పకూలినట్టు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్ ప్రధాన లక్షాల్లో ఇది కూడా ఒకటిగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News