Friday, December 20, 2024

ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిది డ్రోన్ల కూల్చివేత

- Advertisement -
- Advertisement -

మాస్కో : క్రిమియాపై దాడికి యత్నించిన ఉక్రెయిన్‌కు చెందిన ఎనిమిది డ్రోన్లను రష్యా కూల్చివేసింది. నల్ల సముద్రం లోని సెవాస్టోపోల్ సమీపంలో ఉన్న క్రిమియా నౌకాశ్రయ పరిధిలో ఈ సంఘటన జరిగింది. రష్యా రక్షణ వైమానిక , నౌకాదళాలు ఆదివారం వీటిని కూల్చివేశాయని సెవాస్టోపోల్ గవర్నర్ మిఖాయిల్ రజ్వోజాయేవ్ తెలిపారు. ఈ కూల్చివేత సమయంలో నౌకాశ్రయం లోగానీ, నగరంలో గానీ ఎలాంటి ప్రమాదాలు జరగలేదని, ఏ వస్తువులు దెబ్బతినలేదని వెల్లడించారు. ఒక డ్రోన్‌ను సముద్రం మీదుగా కూల్చేశారు. రష్యా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ ఐదు డ్రోన్లపై దాడి చేసింది. రెండు డ్రోన్లను సముద్రం ఒడ్డున ధ్వంసం చేశారని మిఖాయిల్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News