Wednesday, January 22, 2025

50 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేసిన రష్యా

- Advertisement -
- Advertisement -

కీవ్: రష్యావ్యాప్తంగా శుక్రవారం రాత్రి డ్రోన్లతో బాంబుల వర్షాన్ని ఉక్రెయిన్ కురిపించినట్లు మాస్కోలోని రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యాలోని విద్యుత్ కేంద్రాలను లక్షంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. రష్యాలోని వివిధ ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రయోగించిన 50 డ్రోన్లను రష్యా కూల్చివేసింది. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంపై దాడి చేసిన 26 డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయి. డ్రోన్ల కూల్చివేత వల్ల మంటలు చెలరేగి ఒక ఇల్లు దగ్ధం కావడంతో ఒక మహిళ, ఒక పురుషుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. బ్రియాంస్క్, కుర్స్, తులా, సమోలెస్క్, రియాజన్, కలుగ ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకురాగా వాటిని రష్యా సైన్యం కూల్చివేసినట్లు తెలుస్తోంది.

కలుగ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి వల్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగినట్లు ఆ ప్రాంత అధిపతి ఒకరు శనివారం తెలిపారు. రష్యాపై మానవరహిత డ్రోన్ల దాడికి ఉక్రెయిన్ అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకు అమెరికా నుంచి మరింత సహాయాన్ని కోరుతోంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా శుక్రవారం రాత్రి ఏడు క్షిపణులను పేల్చినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం శనివారం తెలిపింది. వీటిలో రెండు క్షిపణులను , మూడు డ్రోన్లను ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు సైన్యం తెలిపింది. రష్యా జరిపిన క్షిపణి దాడిలో వోచాన్స్ నగరంలో ఒక 50 ఏళ్ల వ్యక్తి మరణించగా మరో 60 ఏళ్ల వృద్ధురాలు గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News