న్యూఢిల్లీ: భూతలం నుంచి గగనతలంలో టార్గెట్ ను ఛేదించగల ఎస్-400 ట్రింఫ్ మిస్సైల్ సిస్టంను రష్యా భారత్‌కు అందించడం ఆరంభించింది. ఈ విషయాన్ని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్(ఎఫ్‌ఎస్‌ఎంటిసి) డైరెక్టర్ డిమిత్రి షుగేవ్ తెలిపారు. ఆయన దుబాయ్ ఎయిర్‌షోకు బయలుదేరే ముందు ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం భారత్‌కు పంపడం మొదలయిందని తెలిపారు. చైనా ఇప్పటికే టిబెట్‌లోని ఎన్‌గరి గర్ గున్సా, నింగ్చీ వైమానిక స్థావరాల్లో రెండు ఎస్-400 స్వాడ్రన్స్‌ను మోహరించింది. భారత్ వైమానిక దాడుల ముప్పు దృష్టా రూ. 35000కోట్లతో రష్యా నుంచి 5 స్కాడ్రన్స్‌ను కొనుగోలుచేయడానికి 2018 అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఐదేళ్లలో అన్నీ డెలివరీ అయిపోవాలి. ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో వివిధ రకాల క్షిపణులను వాడి శత్రువుల విమానాలు, ఖండాంతర క్షిపణులు, అవాక్స్ విమానాలు వంటి వాటిని దెబ్బతీయవచ్చు.
భారత్‌కు రష్యా ఎస్-400 మిస్సైల్ సిస్టం డెలివరీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -