Sunday, December 22, 2024

ఉక్రెయిన్‌పై తొలిసారి కింజాల్ క్షిపణిని ఉపయోగించిన రష్యా

- Advertisement -
- Advertisement -

Kinzhal hypersonic missiles
మాస్కో: ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న ఆయుధాల నిల్వ స్థలాన్ని రష్యా తన కింజాల్ హైపర్‌సోనిక్ క్షిపణుల ద్వారా శుక్రవారం ధ్వంసం చేసిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధంలో అత్యాధునిక ఆయుధాన్ని ఉపయోగించినట్లు ఇదివరకెన్నడూ అంగీకరించలేదు. అయితే పాశ్చాత్య అనుకూల ఉక్రెయిన్‌పై జరుపుతున్న దాడిలో కింజాల్ హైపర్‌సోనిక్ ఆయుధాలను ఉపయోగించినట్లు మొదటిసారి రష్యా వార్తా సంస్థ ఆర్‌ఐఎ నోవోస్తి తెలిపింది. కింజాల్ ఏవియేషన్ క్షిపణి వ్యవస్థ హైపర్ సోనిక్ ఏరోబాలిస్టిక్ క్షిపణులతో కూడింది. అది ఇవానోఫ్రాంకివ్స్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో క్షిపణులు, వైమానిక మందుగుండు సామాగ్రి గిడ్డంగిని ధ్వంసం చేసింది’ అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. కాగా ఎఎఫ్‌పి సంప్రదించినప్పుడు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ కింజాల్(డ్యాగర్) క్షిపణిని ‘ఆదర్శ ఆయుధం’గా అభివర్ణించారు. ఇది ధ్వని కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. పైగా వాయు రక్షణ వ్యవస్థలను అధిగమించగలదు. 2018లో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ కొత్త ఆయుధాల శ్రేణిలో కింజాల్ క్షిపణిని కూడా ఆవిష్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News