Thursday, January 23, 2025

మరియూపోల్‌పై రష్యా సూపర్ బాంబులు

- Advertisement -
- Advertisement -

Russia super bombs on Mariupol

దిక్కుతోచని స్థితిలో బందీలుగా లక్ష మంది

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మరింత భీకరదాడులకు దిగాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత తాము లక్షంగా ఎంచుకున్న మరియూపోల్ నగరంపై రష్యా దళాలు రెండు సూపర్ బాంబులను ప్రయోగించాయి. ఓ వైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులతో కైవసానికి యత్నిస్తూనే రష్యా సేనలు మరియూపోల్‌పై విరుచుకుపడ్డాయి. దీనితో ముందు జాగ్రత్త చర్యగా కీవ్‌లో ప్రజలు బయటకు రాకుండా కర్ఫూ విధించారు.

భద్రత కట్టుదిట్టం చేశారు. తమకు అత్యంత తీవ్రస్థాయి భద్రతా ముప్పు వాటిల్లితే , తప్పనిసరి పరిస్థితుల్లోనే అణ్వాయుధాలను వాడుతామని రష్యా పేర్కొంది. అయితే ఇదే దశలో మరియూపోల్‌పై శక్తివంతమైన రెండు సూపర్ బాంబులను విసిరింది. ఇప్పటికే ఈ నగరం రష్యా సేనల దిగ్బంధంలో చిక్కింది. పౌరులు దిక్కుతోచనిస్థితిలో ఉన్నారు. ఈ దశలోనే తీవ్రస్థాయి బాంబులను ప్రయోగించడం మరింత భయానక స్థితిని కల్పించింది. రష్యా సూపర్ బాంబుల ప్రయోగం జరగడంతో ఇక్కడ పలు భవనాలు దెబ్బతిన్నాయి. చివరికి పలు చోట్లవీధులలో పడి ఉన్న భౌతికకాయాలు కూడా ఛిద్రం అయ్యాయని మానవ హక్కుల నిఘా సంస్థ తెలిపింది.

రసాయనిక ఆయుధాలు వాడితే జాగ్రత్త :నాటో

ఉక్రెయిన్‌పై రష్యా రసాయనిక జీవాయుధ ఆయుధాలు వాడితే తీవ్ర పరిణామాలు తప్పవని నాటో కూటమి హెచ్చరించింది. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యకు పాల్పడ్డా , దీని పరిణామాలు వేరే విధంగా ఉంటాయని నాటో స్పష్టం చేసింది. రష్యా కెమికల్, అణ్వాయుధ దాడుల ముప్పు నుంచి ఉక్రెయిన్‌ను రక్షించేందుకు ఉక్రెయిన్‌కు అదనంగా మరింత సాయం అందించాలని నాటో దేశాలు నిర్ణయించాయి.

పుతిన్ ఎంతకైనా తెగించవచ్చు : బైడెన్

పోలెండ్‌లో రష్యా వేగులపై వేటు

ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పుతిన్ రసాయనిక ఆయుధాలను ప్రయోగించవచ్చునని, అమెరికాపై సైబర్ దాడులకు పాల్పడవచ్చునని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్‌పై దాడులుక బెలారస్ నిర్ణయం తీసుకుంది. పోలెండ్‌లో దౌత్యాధికారుల బాధ్యతల్లో ఉంటూ వేగుచర్యలకు దిగుతోన్న 45 మంది రష్యన్లను పోలెండ్ అధికారులు గుర్తించారు. వీరిని దేశం నుంచి బహిష్కరించేందుకు రంగం సిద్ధం చేశారు. దేశ భద్రతకు ముప్పు కల్గిస్తూ వీరు తమ బాధ్యతలను దుర్వినియోగపరుసున్నారని, వీరిని పంపించివేయాలని అధికారులకు పోలెండ్ నిఘా సంస్థలు సమాచారం అందించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News