- Advertisement -
భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు ఉక్రెయిన్‌లో యుద్ధం దృష్టా సప్లయిలలో కొంత మేర జాప్యం దరిమిలా నిర్ధారించిన కొత్త వ్యవధి కింద భారత్ వాటిని అందుకుంటుంది. 5.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కింద భారత్‌కు రష్యా ఇప్పటికే మూడు యూనిట్ల దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థలను సరఫరా చేసింది. రష్యా నిర్మించిన రెండు ఫ్రిగేట్లలో మొదటిదైన తుషిల్ యుద్ధనౌకను కూడా భారత్ సెప్టెంబర్‌లో అందుకుంటుందని ఆ వర్గాలు తెలిపాయి. రెండవ యుద్ధనౌక తమల్‌ను రష్యా జనవరిలో సరఫరా చేస్తుందని ఆ వర్గాలు తెలిపాయి.
- Advertisement -