విజయవంతంగా నిర్వహించిన రష్యా
మాస్కో: మొట్టమొదటిసారి హైపర్‌సోనిక్ క్షిపణిని రష్యా అణు జలాంతర్గామి నుంచి విజయవంతంగా పాటవ పరీక్షను నిర్వహించినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. సెవెరోద్‌విన్సిక్ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన జిర్కోన్ క్షిపణి బారెంట్స్ సముద్రంలోని నిర్దేశిత డమ్మీ లక్ష్యాన్ని తాకిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. జలాంతర్గామి నుంచి జిర్కాన్ క్షిపణిని రష్యా ప్రయోగించడం ఇది మొదటిసారి. నౌకాదళానికి చెందిన నౌక నుంచి గతంలో పలుసార్లు ఈ క్షిపణి ప్రయోగ పరీక్షలు రష్యా నిర్వహించింది. ధ్వని వేగం కన్నా ఎనిమిదిరెట్లు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం జిర్కాన్ క్షిపణికున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ క్షిపణి 1,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదని, ఈ క్షిపణి ప్రవేశం ద్వారా రష్యా సైనిక సామర్థ్యం మరింత బలోపేతం కాగలదని పుతిన్ పేర్కొననారు. జిర్కాన్ పాటవ పరీక్షలు ఈ ఏడాది చివరి కల్లా పూర్తయి 2022లో ఇది రష్యా నౌకాదళంలో ప్రవేశించగలదని అధికారులు తెలిపారు.