Sunday, December 22, 2024

రష్యాలో ప్రత్యేక సెక్స్ కేబినెట్

- Advertisement -
- Advertisement -

రష్యాలో ప్రత్యేకంగా సెక్స్ మంత్రిత్వశాఖ ఏర్పాటు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో గణనీయంగా పడిపోతున్న జనాభా రేటు నేపథ్యంలో అధ్యక్షులు పుతిన్ దిద్దుబాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సంబందిత విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సెక్స్ మినిస్ట్రి ఏర్పాటు జరుగుతుందని వెల్లడైంది. సంతానోత్పతికి పలు ప్రోత్సాహకాలతో దంపతులను ఆకట్టుకోడం జరుగుతుంది. జనం రాత్రిపూట ఇంటర్నెట్‌లకు అతుక్కుపోకుండా చేసేందుకు చర్యలు చేపట్టనున్నారు. రాత్రిపూట నిర్ణీత సమయానికి లైట్లు తీసివేయడం, ఇంటర్నెట్ బంద్ చేయడం వంటి కీలక చర్యలకు వీలుంది. చీకట్లో జరిగే దాంపత్యానికి అనువైన వాతావరణం కల్పించడం

ద్వారా రష్యన్ జాతి క్షీణతను అరికట్టేందుకు పలు ఇతర చర్యలు తీసుకుంటారని కూడా వెల్లడైంది. 1999 తరువాత రష్యాలో అతి తక్కువ జనన నమోదు రేటు రికార్డు ఈ సంవత్సరం ఆరు నెలల కాలంలో రికార్డు అయింది. ఇక ఇప్పటి సుదీర్ఘ ఉక్రెయిన్ యుద్ధం మరింతగా జనం నష్టానికి దారితీసింది. ఈ దశలో క్రెమ్లిన్ అధికార యంత్రాంగం దాదాపుగా యుద్ధ ప్రాతిపదికన పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. ప్రాంతాల వారిగా బర్త్ రేట్లను గుర్తించడం , దీనికి అనుగుణంగా దిద్దుబాటు చర్యలకు దిగడం వంటివి చేపడుతారు. ఇక ఈ వ్యవహారాలన్నింటి సమన్వయం, నియంత్రణకు ప్రత్యేకంగా రష్యాలో త్వరలోనే లైంగిక విషయాల మంత్రిత్వశాఖ ఏర్పాటుకు రంగం సిద్ధం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News