Tuesday, December 24, 2024

రష్యాఉక్రెయిన్ వివాదం: సంక్షోభమా, యుద్ధమా?

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సరిగ్గా సంవత్సరం క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. జి20గా ప్రస్తావించే ప్రపంచంలోని 10 టాప్ ఆర్థిక వ్యవస్థల నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు చర్చించనున్నారు. జి20 సమావేశాన్ని నిర్వహిస్తున్న భారత్ రెండు దేశాల నడుమ ఉన్న ఉద్రిక్తతలను ‘సంక్షోభం’ లేదా ‘సవాలు’గా సూచించాలని కోరుకుంటోంది. కానీ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు శనివారం విడుదలచేయనున్న ‘కమ్యూనిక్’లో ‘యుద్ధం కంటే తక్కువేమి కాదని ఉండాలని కోరుతున్నాయి. భారత్ మాత్రం ‘తటస్థ’ పదాన్ని చేర్చడానికి ఏకాభిప్రాయం సాధించడానికి ప్రయత్నిస్తోందని అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

అధికారులు గత రెండు రోజులుగా ‘కమ్యూనిక్’ భాషపై చర్చించారు. చర్చలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. రష్యాను భారత్ నేరుగా ఖండించనూ లేదు, తరఫ్‌దారి చేయనూ లేదు. అయితే గత ఏడాది కాలంలో భారత్, రష్యాల మధ్య వాణిజ్యం బాగా పెరిగింది. రష్యా నుంచి చమురు దిగుమతి బాగా పెరిగింది.

జి20లో భాగమైన రష్యా, ఉక్రెయిన్‌పై చేసిన దాడిని ‘ప్రత్యేక సైనిక చర్య’గా పేర్కొంది. కాగా గురువారం జరిగిన రహస్య సమావేశం(క్లోజ్డ్ డోర్స్ మీటింగ్)లో రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ డిమాండ్ చేశారు. అంతేకాక మాస్కో యుద్ధం చేయకుండా ఆ దేశ సామర్థాన్ని కట్టడిచేయాలన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అనేక విషయాలు చర్చకు వస్తాయని తెలుస్తోంది. వాటిలో ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల సంస్కరణ, డిజిటల్ కరెన్సీ, చెల్లింపులు, వాతావరణ మార్పు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ వంటి అంశాలు కూడా ఉండనున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News