Sunday, December 22, 2024

ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా కీలక అధికారి మృతి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంతనగరం క్రైవీ రిహ్‌పై రష్యా క్షిపణులు సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి. మంగళవారం ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా సైన్యానికి చెందిన కీలక అధికారి మేజర్ జనరల్ సెర్గీ గోర్యచెవ్ మృతి చెందారని రష్యా మిలిటరీ బ్లాగర్ వెల్లడించారు. గోర్యచెవ్ మృతితో రష్యా ఐదో ఆర్మీ బలగాలు బలవంతంగా దక్షిణ డొనెస్కొ లోని మకరివ్‌కా నగరాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.

మరోవైపు ఉక్రెయిన్ దళాలు పోరాడుతూ రష్యా అధీనం లోకి వెళ్లిన అనేక గ్రామాలకు విముక్తి కలిగిస్తున్నాయి. డొనెట్‌స్క్ ప్రాంతం లోని మూడు గ్రామాలు స్వాధీనమైనట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ ఆదివారం ప్రకటించగా, సోమవారం సొరొఝొవ్ అనే గ్రామంపై ఉక్రెయిన్ పతాకం మళ్లీ ఎగిరిందని రక్షణ శాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News