Thursday, December 26, 2024

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కారణం

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23 ఫిబ్రవరి 2023 న ఒక తీర్మానన్ని ఆమోదించింది. దీని ప్రకారం వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన అయినా కొనసాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించలేదు. న్యాయమైన సమగ్ర శాశ్వత శాంతిని సాధించలేదు. ఈ యుద్ధం 400 రోజులకు చేరబోతోంది. గతేడాది ఘటనల ముందు అంతర్జాతీయ సమాజం మరువరాని వాస్తవం ఒకటుంది. ఉత్తర అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (నాటో) నిరంతర తూర్పు విస్తరణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే కారణమనేదే ఆ అంశం. ఇది పాశ్చాత్య దేశాలపై రష్యా దృక్పథాన్ని మార్చింది. దూరపు భాగస్వామిగా ఉండవలసిన అమెరికా రష్యాకు వాకిటి వద్ద శత్రువుగా మారింది.

అమెరికా తన పొడుగు చేతుల అధికార పరిధిని ఇతర దేశాలపై అనేక రంగాల్లో విస్తరిస్తోంది. ఇది దాని పోటీ విధానం. తన సామర్థ్యం, ఆర్థిక ఆధిపత్యం, దేశీయ చట్టాలను ఇతర దేశాలపై దుర్వినియోగం చేసి తన ఆక్రమణ విధానాలను అమలు చేస్తోంది. ఆ ప్రయోజనం కోసం, అమెరికా సంక్లిష్ట చట్టాల వ్యవస్థను రూపొందించింది. గరిష్ఠ పరిమితులను తగ్గిస్తోంది. తన విచక్షణాశక్తిని విపరీతంగా పెంచింది. ట్రంప్ 3,900 ఆంక్షలు విధించారు. సగటున రోజుకు 3 ఆంక్ష లు. 2021 ఆర్థిక సంవత్సరంలో అమెరికా 9,400 ఆంక్షలు విధించింది. తన పొడుగు చేతుల అధికార పరిధి అమెరికాతో వివిధ దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. క్యూబా నుండి రష్యా వరకు, ఇరాన్ నుండి లిబియా వరకు, తన ఇష్టాన్ని, ప్రమాణాలను ఇతరులపై రుద్దింది. అమెరికా మిత్ర బృందమని భావించే యూరోపియన్ యూనియన్ కూడా దాని ఎత్తుగడలపై అసంతృప్తిగా ఉంది. అమెరికా పొడుగు చేతుల అధికార పరిధి విధానాన్ని అరికట్టడానికి పలుమార్లు ప్రయత్నించింది. అనేక ఎత్తుగడలను వేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వివాదాలను పరిష్కార ప్రక్రియలుగా ప్రవేశపెట్టింది.

అమెరికా చర్యలు అంతర్జాతీయ పాలనా యంత్రాంగాల పని తీరును కూడా నాశనం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి వెలుపల తన ఏకపక్ష ఆంక్షలను లెక్కలేనన్ని సార్లు విధించింది. దేశాలకు, సంస్థలకు చట్టబద్ధ సదుపాయాల కల్పనలో ఐక్యరాజ్య సమితి పాత్రను బలహీనపరిచింది. దాని సూపర్ 301 నిబంధన అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ధారించినప్పటికీ, చైనా, ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులపై దాని 301 నిబంధన కింద విచారణలను కొనసాగిస్తోంది. బహుపాక్షిక వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తోంది.

ఆ విధానంతో, వాణిజ్య పోటీదారులను దెబ్బ కొట్టడానికి, అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలలో జోక్యం చేసుకోవడానికి అమెరికా తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. జపాన్‌లోని తోషిబా, జర్మనీలోని సీమెన్స్, ఫ్రాన్స్‌లోని ఆల్‌స్టోమ్‌లు అమెరికా సముద్ర దొంగల వంటి పనుల వల్ల నష్టపోయాయి.
అమెరికా చర్యలు ఇతర దేశాలలో ప్రాథమిక మానవ హక్కులను కూడా ఉల్లంఘిస్తాయి. ఇతర దేశాలపై అమెరికా భారీ ఆర్థిక ఆంక్షలు విధించింది. మానవ విపత్తులకు కారణమయింది. అఫ్ఘానిస్తాన్, ఇరాన్, సిరియా, యెమెన్‌లపై విధించిన ఆర్థిక ఆంక్ష లు కొవిడ్ -19 విశ్వ మహమ్మారిపై పోరాడే వారి సామర్థ్యాలను బలహీనపరిచాయి. అమెరికా ఆంక్షల కారణంగా ఒక్క ఇరాన్‌లోనే కొవిడ్- 19 కారణంగా 13,000 మంది మరణించినట్లు అమెరికాలో పని చేసే బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేసింది. ఉక్రెయిన్ సంఘర్షణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే మూలకారణం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 23 ఫిబ్రవరి 2023 న ఒక తీర్మానన్ని ఆమోదించింది.

దీని ప్రకారం వివాదానికి మూలకారణాన్ని పరిష్కరించని ఏ ప్రతిపాదన అయినా కొనసాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించలేదు. న్యాయమైన సమగ్ర శాశ్వత శాంతిని సాధించలేదు. ఈ యుద్ధం 400 రోజులకు చేరబోతోంది. గతేడాది ఘటనల ముందు అంతర్జాతీయ సమాజం మరువరాని వాస్తవం ఒకటుంది. ఉత్తర అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్ (నాటో) నిరంతర తూర్పు విస్తరణకు రష్యా పట్ల అమెరికా శత్రుత్వమే కారణమనేదే ఆ అంశం. ఇది పాశ్చాత్య దేశాలపై రష్యా దృక్పథాన్ని మార్చింది. దూరపు భాగస్వామిగా ఉండవలసిన అమెరికా రష్యాకు వాకిటి వద్ద శత్రువుగా మారింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాతి పరిణామాలతో రష్యా ఇంకా బాధపడుతుండగా ప్రచ్ఛన్న యుద్ధ కూటమి తూర్పు వైపు (రష్యా దిశగా) తన శిబిరాలను నెట్టడం రష్యా అభద్రతా భావాన్ని తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా ప్రత్యేక సైనిక చర్య కంటే, తన చర్యలతో రష్యాకు అనూహ్య ముప్పు కలగాలని అమెరికా కోరిక. అందుకే సంఘర్షణ ముగింపుకి అమెరికా తొందరపడటం లేదు. రష్యాను కిందికి లాగి, యూరప్‌పై తన అధికారాన్ని పునరుద్ఘాటించాలని కోరుకుంటోంది. ఆయుధాల, ఇంధనశక్తి అమ్మకాలతో విపరీతమైన లాభాలు పొందుతోంది.

పశ్చిమ దేశాల చర్యలు రష్యాకు భద్రతా సంక్షోభాన్ని సూచిస్తాయి. నిరంకుశత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా అమెరికా చిత్రీకరించిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, రష్యాను నిర్వీర్యం చేయడానికి ఏళ్ల తరబడిచేస్తున్న దాని సుదీర్ఘ ప్రచారానికి పరాకాష్ఠ. రష్యాపై తన ఏకపక్ష ఆంక్షలలో చేరడానికి నిరాకరించిన దేశాలను విమర్శిస్తోంది. తద్వారా నైతిక ఉన్నత స్థాయికి దావా వేసింది. అమెరికా తమపై మోపడానికి ప్రయత్నిస్తున్న నైతిక భారం వల్ల ఊగిసలాడకుండా ప్రపంచ దేశాలు ఈ విషయంలో తప్పొప్పులను నిష్పక్షపాతంగా పరిశీలించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఇతర శాశ్వత సభ్యులలో, రష్యాపై ఆంక్షలు విధించడంలో, ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించడంలో చైనా మాత్రమే అమెరికాతో చేరలేదు. రష్యాకు దాని ప్రత్యేక సైనిక చర్యలో చైనా మద్దతు ఇవ్వలేదు. ఉక్రెయిన్ సంక్షోభంపై దాని వైఖరి తటస్థం. కాల్పుల విరమణపై మాట్లాడాలని, యుద్ధాన్ని విరమించాలని ఇరుపక్షాలను కోరుతోంది. రష్యాతో చైనా సంబంధాలు ఏ పార్టీ ఆమోదానికి గాని, ఉక్రెయిన్‌తో సంబంధాలకు గాని లోబడి లేవు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభంలో చైనా ప్రయోజనాలు లేవు. సైనిక సమూహాలను బలోపేతం చేయడం లేదా విస్తరించడం ద్వారా ఒక ప్రాంతపు భద్రత సాధించబడదు. ఒక దేశ భద్రతను ఇతరుల ఖర్చుతో కొనసాగించకూడదు అని 24 ఫిబ్రవరి 2023 న చైనా విడుదల చేసిన పరిస్థితి పత్రం తెలిపింది.

ఐక్యరాజ్యసమితి అధికార పూర్వకంగా ఆమోదించని, అంతర్జాతీయ చట్టంలో చట్టబద్ధతలేని ఆంక్షలను అమెరికా రష్యాపై విధించింది. ఉక్రెయిన్‌కు అత్యంత అధునాతన ఆయుధాలను సరఫరాచేస్తూనే ఉంది. దాని నాటో మిత్ర దేశాలను అదే విధంగా చేయమని ప్రోత్సహిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాను ఉన్నత నైతిక స్థాయిలో ఉన్నానని చెప్పడం హాస్యాస్పదం, అసంబద్ధం. రష్యాకు వ్యతిరేకంగా పరోక్ష ప్రాతినిధ్య యుద్ధం చేయించడంలో అమెరికా ప్రాథమిక దురాక్రమణదారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం అవసరమైన అనుకూల పరిస్థితులను సృష్టించేందుకు ఆ పరోక్ష ప్రాతినిధ్య యుద్ధాలను ఆపడం మొదటి అడుగు కాగలదు. రష్యా- ఉక్రెయిన్ సంక్షోభానికి పరస్పరం మాట్లాడుకోవడం, చర్చలు జరపడం మాత్రమే ఆచరణీయ పరిష్కారం. ఉక్రెయిన్ సార్వభౌమ రాజ్యమైనప్పటికీ, అమెరికా కూటమి దానికి నిధులు, మద్దతు ఇస్తోంది. ఉక్రెయిన్ ఈ సహాయాల భ్రమలో చిక్కుకుంది. అది రష్యాతో మాట్లాడాలనుకున్నా, అమెరికా దానికి అనుమతించనంత కాలం, ఉక్రెయిన్‌కు వేరే మార్గంలేదు. పోరాడుతూనే ఉంటుం ది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అమెరికా తన అధికార దుర్వినియోగాన్ని విడిచిపెట్టి ప్రపంచ సమాజంలో చేరాలి.

సంగిరెడ్డి, హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News