Sunday, December 22, 2024

10 వేల రష్యన్ సైన్యం, 250 ట్యాంకులు మట్టుబెట్టాం : ఉక్రెయిన్

- Advertisement -
- Advertisement -

Russia-ukraine war latest news

కీవ్ : రష్యాకు చెందిన 10 వేల మంది సైనికులను, 251 యుద్ధ ట్యాంకులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ శుక్రవారం వెల్లడించింది. మార్చి 4 వరకు తమ దేశంలో ప్రవేశించిన రష్యన్ దళాలపై దాడికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. 9166 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టగా, 50 ఎంఎల్‌ఆర్‌ఎస్ వాహనాలు, 33 వార్ విమానాలు, 37 హెలికాప్టర్లు, 404 కార్లు, 2 బోట్లు, 251 యుద్ధ ట్యాంకులు, 60 ఇంధన వాహనాలు, 18 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్‌ఫేర్‌లు ధ్వంసం అయినట్టు సైన్యం తెలిపింది. రష్యా దళాలు తమ సరిహద్దు నుంచి 500 కిమీ దాటి కీవ్ నగరానికి 25 కిమీ దూరంలో బస చేశాయి. కానీ వేలమంది సైనికులు ఆహారం అందక పోవడం, ఆకలితో అలమటిస్తుండడంతో రష్యాదళాలు ముందుకుసాగ లేక పోతున్నాయి. దీనికి తోడు వందల యుద్ధ ట్యాంకుల్లో ఇంథనం అయిపోవడంతో ఒకే చోట సైనిక బలగాలు, ట్యాంకులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News