Wednesday, January 22, 2025

భీకర రూపం దాల్చిన యుద్ధం

- Advertisement -
- Advertisement -

russia-ukraine war latest news

ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడిన రష్యా
డాన్‌బాస్‌లో 470కి.మీ పొడవునా దాడులు
24 గంటల్లో 1000 చోట్ల నిప్పుల వర్షం
మరియుపోల్‌లో ఉక్కు ఫ్యాక్టరీపై బంకర్ విధ్వసక బాంబులు

కీవ్: ఎన్ని అల్టిమేటంలు జారీ చేసినా తమ దారికి వచ్చేందుకు ఉక్రెయిన్ సైన్యం ససేమిరా అంటుండడంతో ఆగ్రహించిన రష్యా మంగళవారం అన్ని ప్రాంతాలపైనా విచక్షణా రహితంగా విరుచుకుపడింది. రష్యాను ఆనుకుని ఉన్న ప్రాంతాలు, మరి కొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. 24 గంటల వ్యవధిలో దాదాపు వెయ్యి చోట్ల్ల దాడులు చేసినట్లు ప్రకటించింది. డాన్‌బాస్ తీరప్రాంతంలోనైతే ఈశాన్యంనుంచి ఆగ్నేయం వరకు 470 కిలోమీటర్ల పొడవునా దాడులు కొనససాగించింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పారిశ్రామిక ప్రాంతాలను చేజిక్కించుకునే లక్షంతో రష్యా ఎడతెరపి లేకుండా దాడులు చేస్తోంది. అక్కడి నగరాలు, పట్టణాలపై ఫిరంగుల వర్షం కురిపించింది. డాన్‌బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే తమ లక్షమని రష్యా ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఎదురవుతున్న ఇబ్బందులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో దీన్ని సాధిస్తే పుతిన్‌కు అదిపెద్ద ఊరటే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న వ్యూహం బెడిసికొట్టడంతో అక్కడినుంచి వెనక్కి తీసుకున్న బలగాలను రష్యా వ్యూహాత్మక ప్రాంతాల్లో తిరిగి మోహరించింది.

తాజా గగనతల దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన 13 ఆయుధాగారాలను, 60 దాకా సైనిక సదుపాయాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనషెంకోవ్ ప్రకటించారు.1260 సైనిక సదుపాయాలను పదాతి దళాలు నాశనం చేశాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఖర్కివ్, జపోరిజిజియా, ద్నిప్రో తదితర ప్రాంతాలు రష్యా దాడులతో దద్దరిల్లాయి. పోలండ్ రిహద్దుల్లో ఉండి ఇప్పటివరకు పెద్దగా దాడులు జరగని లివివ్‌లో సైతం క్షిపణి దాడుల్లో ఏడుగురు చనిపోయారు. డాన్‌బాస్ ప్రాంతంలోని ్రక్రెమిన్నా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మాస్కో వర్గాలు ప్రకటించింది. ఇక పోర్టు సిటీ మరియుపోల్‌ను రష్యా స్వాధీనం చేసుకోవడం ఖాయమని చెచెన్యా అంచనా వేసింది. మరియుపోల్ నగరంలో ఉక్రెయిన్ తరఫున పోరాడుతున్న వారు తలదాచుకున్న అజోవ్‌సత్ల్ ఉక్కు కర్మాగారంపైకి బంకర్ విధ్వసక బాంబులను రష్యా ప్రయోగించింది. దాదాపు 11 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ కర్మాగారంలో పలువురు సాధారణ ప్రజలూ ఆశ్రయం పొందుతున్నారు. దీనిలో పలు సొరంగ మార్గాలూ ఉన్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన డాన్‌బాస్‌పైనే పుతిన్ సేన గురిపెట్టిందని, దాని కోసమే సైన్యంలో ఎక్కువ భాగం కేటాయించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. పోరులో మలి దశ మొదలైందని ఇరు పక్షాలు కూడా ప్రకటించడం గమనార్హం. తదుపరి దశ ఘర్షణాత్మకంగా ఉంటుందని, కొన్ని నెలల పాటు కొనసాగుతుందని బ్రిటన్ సీనియర్ అధికారి ఒకరు అంచనా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News