Thursday, December 26, 2024

బెలారస్ మిలిటరీతో రష్యా వాగ్నర్ సైనికుల సంయుక్త విన్యాసాలు

- Advertisement -
- Advertisement -

మాస్కో : రష్యా మిలిటరీ సంస్థ వాగ్నర్‌ కు చెందిన సైనికులు గురువారం బెలారస్ మిలిటరీ సైనికులతో సంయుక్త విన్యాసాలు పోలాండ్ సరిహద్దు సమీపాన ప్రారంభించారు. రష్యాపై కొద్దిగా తిరుగుబాటు చేసి విఫలమైన తరువాత వాగ్నర్ బెలారస్‌కు స్థావరం మార్చారు. సరిహద్దు నగరం బ్రెస్ట్ వద్ద వారం రోజుల పాటు ఈ విన్యాసాలు సాగుతాయని, బెలారస్ ప్రత్యేక దళాలు ఇందులో పాలుపంచుకుంటాయని బెలారస్ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వాగ్నర్ తిరుగుబాటు అనుభవం బెలారస్ మిలిటరీ ఆధునికీకరణకు సహకరిస్తుందని మంత్రిత్వశాఖ వివరించింది. ఈమేరకు బుధవారం విడుదల చేసిన వీడియోలో రష్యాపై తిరుగుబాటు తరువాత వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కనిపించడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News