Monday, November 25, 2024

రష్యా యుద్ధం ముగింపును కోరుకుంటోంది: వ్లాదిమీర్ పుతిన్

- Advertisement -
- Advertisement -

మాస్కో: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం ముగింపును రష్యా కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ గురువారం తెలిపారు. దౌత్యపరమైన చర్చల ద్వారా సాయుధ యుద్ధాన్ని ముగించాలని కోరారు. “యుద్ధాన్ని నిరంతరం కొనసాగించాలని మేము కోరుకోవడంలేదు. అందుకు యుద్ధం ముగింపును కోరుకుంటున్నాం” అని పుతిన్ అన్నారు. “వీలయినంత త్వరలో దీనికో ముగింపు పలుకుతాం” అన్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోడిమిర్ జెలెంస్కీ శ్వేత సౌధాన్ని సందర్శించిన మరునాడే పుతిన్ విలేకరులతో మాట్లాడుతూ “నేను ఇదివరకే చాలాసార్లు చెప్పాను. శత్రుత్వం పెరిగిపోయేకొద్దీ అది తీవ్ర నష్టాలకు దారి తీయగలదు” అన్నారు. ఉక్రెయిన్, అమెరికా అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ చర్చలకు తాము సిద్ధమేనని రష్యా గట్టిగా చెబుతోంది. కానీ ఉక్రెయిన్, అమెరికా మాత్రం బలం పుంజుకోడానికి కొంత సమయం కోసమే రష్యా ఇలా అంటోందని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 10 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. అందులో కొన్ని సందర్భాల్లో రష్యా ఓటములు, వెనక్కి తగ్గడాలు కూడా చవిచూసింది. ఉక్రెయిన్ చర్చలకు ముందుకు రావడంలేదని రష్యా స్పష్టం చేసింది. దాడులు ఆపాలని, ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చేయాలని ఉక్రెయిన్ మడతపేచి పెట్టి యుద్ధం ఆగకుండా మెలికపెడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News