Monday, January 20, 2025

విషాదంగా మారిన షో.. రష్యా నటి మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో : ఉక్రెయిన్ దాడిలో రష్యా నటి పొలినా మెన్షిక్ మృతి చెందారు. రష్యా అధీనంలో ఉన్న ఈస్టర్న్ ఉక్రెయిన్ ప్రాంతంలోని డొన్బస్‌లో ఈ నటి రష్యాకు చెందిన కళాకారుల బృందంతో కలిసి ప్రదర్శన ఇస్తుండగా దాడి జరిగింది. మూడు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. మెన్షిక్ రంగస్థల నటిగా పేరొందారు.

స్కూల్, కల్చరల్ సెంటర్లపై హిమారస్ మిస్సైల్స్‌తో దాడి జరిగిందని రష్యా సైనికాధికారుల సమాచారం ప్రాతిపదికన రష్యా అధికారిక టీవీ వార్త వెలువరించింది. రష్యా ఉక్రెయిన్ పరస్పర దాడుల ప్రాంతానికి ఘటనాస్థలి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. రష్యా సైనిక పతాకాల ఉత్సవం నేపథ్యంలో ఈ నటి షో జరుగుతూ ఉండగా దాడికి బలి అయినట్లు నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News