- Advertisement -
2016 తర్వాత తొలిసారి రష్యా సిరియాలోని అలెప్పో పై తాజాగా వైమానిక దాడులు చేసింది. సిరియా జిహాదీలు అలెప్పో నగరంలో ఉల్లంఘనలకు పాల్పడుతుండడంతో రష్యా వైమానిక దాడులు చేసింది. కాగా జిహాదీలు ఉల్లంఘనలకు పాల్పడుతుండడంతో బషర్ అల్-అస్సద్ ప్రభుత్వం రష్యా మిలిటరీ సాయం కోసం ఎదురు చూస్తోంది. ఇదిలావుండగా విమానాశ్రయాలు, రోడ్లను మూసేశారు. తిరుగుబాటు దారులను అణచివేస్తామని రష్యా అస్సద్ ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.
- Advertisement -