Saturday, December 21, 2024

కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా వైమానిక దాడి

- Advertisement -
- Advertisement -

Russian airstrikes on a chemical factory

టన్నుల కొద్ది విషపూరిత అమ్మోనియా వ్యాప్తి

కీవ్ : ఉక్రెయిన్‌లోని సుమీలో కెమికల్ ఫ్యాక్టరీపై సోమవారం రష్యా భీకర స్థాయిలో దాడికి దిగింది. దీనితో ఈ ప్రాంతంలో అత్యంత భయంకరమైన అమ్మోనియా విషవాయువులు వ్యాపించాయి. ఈ ప్రాంతపు ప్రజలు గంటల కొద్ది సేపు ఉక్కిరిబిక్కిరయ్యారు.సుమీకింప్రోమ్ కెమికల్ ప్లాంట్‌పై రష్యా సేనలు వైమానిక దాడికి దిగిన విషయాన్ని ఆ ప్రాంతపు గవర్నర్ ఒబ్లాస్ట్ డిమిట్రో జివిటిస్కీ నిర్థారించారు. తెల్లవారుజామున ఈ ప్రాంతంలో విషవాయువులను పసిగట్టారని, తరువాతి పరిశీలనలో కెమికల్ ఫ్యాక్టరీపై రష్యా దాడులతో అమ్మోనియా వాయువుల లీకేజ్‌గా తెలిసిందని చెప్పారు. కీవ్‌లో అత్యంత జనసమ్మర్థపు షాపింగ్ మాల్‌పై బాంబుల దాడి దశలోనే సుమీలో కెమికల్ ప్లాంట్‌పై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడులకు దిగాయి.

కెమికల్ ప్లాంట్‌లోని 50 టన్నుల విషవాయువు ట్యాంకుపై రష్యా సేనలు దాడులకు దిగతాయి. దీనితో ఇందులోని గ్యాస్ బయటకు విరజిమ్మింది. విషవాయువు మేఘంగా కేంద్రీకృతం అయ్యి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం వరకూ వ్యాపించింది. దీని ప్రభావం లేకుండా చేసేందుకు అత్యవసర సిబ్బంది హుటాహుటిన చేరుకుంది. ఈ ప్లాంట్‌లో అత్యంత ప్రమాదకర రసాయనిక ఎరువుల ఉత్పత్తి జరుగుతంది. ఇందులోని ముడి పదార్థాలు మనిషికి సోకితే దీర్ఘకాలిక అనారోగ్యాల దుష్ప్రభావం పడుతుంది. ఈ వాయువులు సోకిన ప్రాంతంపై ఏళ్ల తరబడి ప్రభావం ఉంటుంది. ఉక్రెయిన్‌పై జీవ రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెపుతూ వచ్చిన రష్యా దీనికి ప్రతిగానే ఇక్కడి ప్లాంట్‌ను గురిచేసుకుని దాడులకు దిగిందని నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News