Thursday, January 23, 2025

లైమాన్‌ను స్వాధీనం చేసుకున్నరష్యా సైన్యం

- Advertisement -
- Advertisement -
Lyman captured
లుగాన్స్క్ ప్రావిన్స్‌లోని సెవెరోడోనెట్స్క్ ,  లైసిచాన్స్క్‌లను కూడా రష్యన్ దళాలు సమీపిస్తున్నాయి.

మాస్కో: కైవ్ నియంత్రణలో ఉన్న రెండు కీలక నగరాలకు వెళ్లే మార్గంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక పట్టణం లైమాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా సైన్యం శనివారం ధృవీకరించింది.”డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ యొక్క మిలీషియా యూనిట్లు,  రష్యన్ సాయుధ దళాల సంయుక్త చర్యలను అనుసరించి, లైమాన్ పట్టణం ఉక్రేనియన్ జాతీయవాదుల నుండి పూర్తిగా విముక్తి పొందింది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లైమాన్ ను స్వాధీనం చేసుకున్నామన్న మాస్కో అనుకూల వేర్పాటువాదుల వాదనను రక్షణ మంత్రిత్వ శాఖ బలపరిచింది.

ఈరోజు ప్రారంభంలో, ఉక్రేనియన్ అధ్యక్ష సలహాదారు ,శాంతి చర్చల సంధానకర్త మైఖైలో పోడోల్యాక్ మాట్లాడుతూ రష్యాతో ఎలాంటి ఒప్పందాన్ని విశ్వసించలేమని ,  మాస్కో బలవంతంగా దాని దండయాత్రను మాత్రమే ఆపగలదని అన్నారు.”రష్యాతో ఏ ఒప్పందం అయినా చెల్లని పెన్నితో సమానమే ” అని మిస్టర్ పోడోల్యాక్ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో రాశారు. “ఎప్పుడూ అబద్ధపు  ప్రచారం చేసే దేశంతో చర్చలు జరపడం సాధ్యమేనా?” అన్నారు.

శాంతి చర్చలు నిలిచిపోయిన తర్వాత రష్యా , ఉక్రెయిన్ ఒకదాన్ని మరొకటి నిందించుకున్నాయి, మార్చి 29న చివరిగా ముఖాముఖి చర్చలు జరిగాయి. ఈ నెల ప్రారంభంలో పురోగతి లేకపోవడం వల్ల ఉక్రెయిన్ తో  శాంతి చర్చలను కొనసాగించడానికి సుముఖత చూపడం లేదని క్రెమ్లిన్ తెలిపింది, అయితే కైవ్‌లోని అధికారులు రష్యాను నిందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News