Friday, November 22, 2024

జెలెన్‌స్కీ టౌన్‌పై రష్యా దాడులు

- Advertisement -
- Advertisement -

Russian attack by suicide drones on Zelensky's hometown

అణుబాంబుల సంకేతాలు?

కీవ్ : రష్యా సైనిక బలగాలు ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీ స్వస్థలం ఇతర లక్షాలను ఎంచుకుని దాడులను తీవ్రతరం చేసింది. ఒక్కరోజు క్రితం రష్యా బలగాలు అత్యంత కీలకమైన లైమన్‌ను వదులుకోవల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలు మరింతగా మొహరించుకుని ఉండటంతో వెనుదిరిగాయి. తమ ఆధిపత్యం తిరిగి చాటుకునేందుకు ఇప్పుడు జెలెన్‌స్కీ స్వస్థలం క్రివ్యీ రిహ్ పట్టణంపై సూసైడ్ డ్రోన్లతో రష్యా దాడికి దిగింది. ఇక్కడ ఓ స్కూల్‌పై డ్రోన్లు విరుచుకుపడ్డాయి. రెండంతస్తులను ధ్వంసంచేశాయి. గతరాత్రి తాము ఐదు ఇరాన్‌నిర్మిత డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రతినిధి ఒకరు తెలిపారు. రష్యా అధ్యక్షులు పుతిన్ అధికారికంగా ఇటీవల నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలను విలీనం చేసిన తరువాత ఇందులోని ఓ కీలక ప్రాంతం తిరిగి ఉక్రెయిన్ వశం కావడంతో రష్యా ఈ యుద్థాన్ని మరింత తీవ్రతరం చేయనుందని, అవసరం అయితే కొన్ని నిర్ణీత ప్రాంతాలపైకి పరిమిత సామర్థపు అణుబాంబులు ప్రయోగించేందుకు వీలుందని, ఈ దిశలో కొన్ని వేర్పాటువాద శక్తులు పుతిన్‌ను ప్రేరేపిస్తున్నాయని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News