Sunday, January 19, 2025

కీవ్‌పై రష్యా దాడి: నలుగురు ఉక్రెయిన్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద రష్యా శనివారం డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో కనీసం నలుగురు చనిపోయి ఉంటారని వార్త. ఉక్రెయిన్ వైమానిక దళం కథనం ప్రకారం రష్యా 39 షేడెడ్ డ్రోన్లను ప్రయోగించింది. అంతేకాక ఇతర సిమ్యులేటర్ డ్రోన్లు, క్షిపణులను కూడా ప్రయోగించింది. షెవ్‌చెంకివ్‌స్కీ జిల్లాలో రష్యా క్షిపణిని కూల్చివేసినప్పుడు నలుగురు చనిపోయారని కీవ్ సిటీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ తైమూర్ తకాచెంకో తెలిపారు. కాగా రష్యా రెండు క్షిపణులను, 24 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం తన ప్రకటనలో పేర్కొంది.కాగా ఉక్రెయిన్‌లోని పోల్టావా,సుమీ, ఖర్కీవ్, చెర్‌కసి, చెర్నిహీవ్, కీవ్, ఖెల్నిట్సీ, జైటోమిర్, కిరవోహ్రాడ్, డ్నిప్రోపెట్రోవ్స్, ఖేర్సన్, దొనేత్సక్ ప్రాంతాల్లో డ్రోన్లను, క్షిపణులను కూల్చేయడం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News