Sunday, December 22, 2024

ఉక్రెయిన్‌లో పౌరుల కాన్వాయ్‌పై రష్యాబాంబుల దాడి… 20 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Russian bombs attack civilian convoy in Ukraine

కీవ్ : ఉక్రెయిన్‌లో పౌరుల కాన్వాయ్‌పై రష్యా బాంబుల దాడి సాగించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్ లోని కుపియాన్స్ పట్టణంలో అనేక వాహనాల్లో వెళ్తున్న జనంపై బాంబు దాడులు జరిగాయని ఖార్కివ్ ప్రాంత గవర్నర్ ఒకేగ్ సినెగుబోవ్ శనివారం తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం కనీసం 20 మంది ప్రజలు ఆయా వాహనాల్లో ప్రాణాలు కోల్పోయారని వివరించారు. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు కార్లు, వ్యాన్లలో వీరంతా వెళ్తుండగా రష్యా దాడులు జరిగాయని ఒకేగ్ ఆరోపించారు. ఉక్రెయిన్ లోని కొన్ని ప్రాంతాలను కలుపుకోడానికి రష్యా దాడులను ముమ్మరం చేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News