Monday, December 23, 2024

ఉక్రెయిన్ రవాణా మార్గంపై రష్యా డ్రోన్ల దాడి

- Advertisement -
- Advertisement -

కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు ఆదివారం మూడున్నర గంటల పాటు భీకర దాడులకు దిగాయి. ప్రత్యేకించి ఉక్రెయిన్‌కు చెందిన పలు సరఫరాల కేంద్రం అయిన ఒడెసా ప్రాంతంలోని రేవు పట్టణాలపై ఈ దాడులు సాగించారు ఈ డ్రోన్ల దాడులను తాము తిప్పికొట్టామని ఉక్రెయిన్ తెలిపింది. అయితే దాడులతో పలువురికి గాయాలు అయ్యినట్లు , ఇద్దరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. టర్కీ అధ్యక్షులు రెసెప్ తయీప్ ఎర్డోగాన్‌తో పుతిన్ సోమవారం చర్చలు జరపాల్సి ఉంది. ఈ దశలోనే ఉక్రెయిన్ కీలక రేవులపై రష్యా డ్రోన్ల దాడులు జరిగాయి. జులైలో రష్యా బ్లాక్ సీ ధాన్యం సరఫరా ఒప్పందం నుంచి వైదొలిగింది.

దీనితో టర్కీ ఇతర దేశాల నుంచి బ్లాక్ సీ మీదుగా ఉక్రెయిన్‌కు సరఫరాలు నిలిచిపొయ్యాయి. ఒప్పంద పునరుద్ధరణ దిశలో పుతిన్ ఎర్డోగాన్ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. మరి దీనికి విఘాతంగా ఇప్పుడు రష్యా డ్రోన్ల దాడులను ఉధృతం చేసిందని, ఇది కేవలం ఉక్రెయిన్‌లో ఆహార సంక్షోభం నెలకొనేందుకు సాగించిన కుట్రలో భాగమే అని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి ఒక్కరు తెలిపారు. కాగా ఇరాన్ నిర్మితమైన షాహెద్ డ్రోన్లు పాతిక వరకూ దనూబే నది వెంబడి రవాణా మార్గాలను ఎంచుకుని రష్యా వ్యూహాత్మకంగా దాడికి దిగిందని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News