Thursday, January 23, 2025

సైబిరియాలో కూలిన రష్యా యుద్ధవిమానం

- Advertisement -
- Advertisement -

Russian fighter jet crashed in Siberia

ఇద్దరు పైలట్‌ల మృతి

మాస్కో: రష్యా యుద్ధవిమానం ఆదివారం సైబిరియాలోని ఇర్కుట్స్ నగరంలో నివాస భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్‌లు ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలో రష్యా యుద్ధవిమానం నివాసప్రాంతాల్లో కూలిపోవడం ఇది రెండోసారి. ఇర్కుట్స్ ఇగోర్ గవర్నర్ కోబ్జెవ్ మాట్లాడుతూ రెండు కుటుంబాలు నివసిస్తున్న రెండు అంతస్తుల బిల్డింగ్‌పై కూలిపోయిందని తెలిపారు. క్రూ సిబ్బంది తప్ప నివాసితులు ప్రాణాలు కోల్పోలేదని వెల్లడించారు. రష్యా అత్యవసర మంత్రిత్వశాఖకు చెందిన స్థానిక ప్రతినిధులు మాట్లాడుతూ ఫైటర్‌జెట్ యుద్ధ సన్నాహాల్లో మంటలు చెలరేగటంతో కూలిపోయిందని తెలిపారు. ఫైటర్ జెట్ కూలిన ఘటనకు సంబంధించిన రష్యా సోషల్ మీడియాలో పోస్టు అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News